భగవాన్ శ్రీ రమణ మహర్షి భారతదేశం వేదభూమి, కర్మభూమి, ఎందరో మహర్షులు మహనీయులు మహితాత్ములు నడయాడిన పుణ్యభూమి. అరుణగిరిలో వెలసి ఆత్మతత్వాన్ని మౌనంగా ప్రపంచానికి భోధించిన దివ్యాత్మ స్వరూపులు భగవాన్ శ్రీ రమణులు. నిరాడంబరత, ప్రేమ, మూర్తిభవించిన రూపమే భగవాన్ శ్రీ రమణులు. భూతదయ, అహింసను ఆచరించి చూపిన మహనీయులు. "నేను ఎవరో ఆలోచించు" అనే ఆయన దివ్యవాక్కుతోనే ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని భోదించారు. ఆయన జీవితం, ఆచరణే, జగతికి ఆయన ఇచ్చిన సందేశం. శ్రీ భగవాన్ 'మౌనముని' గా ప్రసిద్ధిగాంచారు. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అమృతనాధ యతీంద్రులనే కేరళ సన్యాసి శ్రీ భగవాన్ ని "అరుణాచల రమణుడు గురు రూపంలో కనిపించే స్కందుడా? మహావిష్ణువా? గొప్ప యోగా , లేక దత్త్తాత్రేయులా?" అని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు భగవాన్ "శ్రీ మహావిష్ణువు మొదలు సమస్త జీవజాతుల యందును, వారి హృదయంలో "నేను" అని ఎరుకగా ప్రకాశించే తత్త్వం ఏదైతే ఉందో అదియే "రమణుడు" అని చెప్పారాయన. రమణులు మహిమలు ప్రదర్శించలేదు. అయితే వారి సన్నిధిలో మహిమలు జరగని క్షణమే లేదు. ఎందరో రాజకీయ, సాహిత్య, విదేశి ప్రముఖులు శ్ర...